Thursday, January 9, 2025

రోడ్లు ఊడుస్తూ విఓఏల నిరసన..

- Advertisement -
- Advertisement -

గంగారం: విఓఏల సమస్యలను పరిష్కరించాలని గత 10 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని ఊడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు చింత సతీష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విఓఏల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలన్నారు. 19 ఏళ్ల నుంచి గ్రామాల్లో మహిళ అభ్యున్నతికి, మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తూ మహిళలు ఆర్థికంగా,

సామాజికంగా ఎదగడానికి వారిని అవగాహన కల్పిస్తూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించి వారికి లోన్లు ఇప్పించి తిరిగి సక్రమంగా చెల్లించే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విఓఏలకు కనీస వేతనం రూ. 26 వేలు, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జనగాం ముత్తయ్య, కోశాధికారి గుండగాని శ్రీను, సభ్యులు ప్రమీల, సువార్త, నిరోష, లక్ష్మీనారాయణ,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News