Wednesday, January 22, 2025

రాఖీ కానుక…విఒఎల వేతనాలు పెంపు

- Advertisement -
- Advertisement -

రూ.5వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ
అదనపు సాయం రూ.3వేలతో కలిసి రూ.8వేలకు చేరిన గౌరవ వేతనం
యూనిఫాం కోసం రూ.2కోట్ల నిధులు విడుదల

ఏడాదికొకసారి రెన్యూవల్ విధానం
మంత్రులకు రాఖీలు కట్టి సన్మానించిన మహిళలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : గ్రామ సంఘం సహాయకుల(విఒఎ)కు ముఖ్యమంత్రి కెసిఆర్ రాఖీ పండుగ కానుక అందించారు. గ్రామ సంఘాల సహాయకుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రూ.3,900 నుంచి రూ.5 వేలకు పెం చుతూ తక్షణ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో పాటు అదనపు సాయం రూ.3 వేలతో కలిపి ప్రతి నెలకు రూ.8 వేలు విఒఎలు అందుకోనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 17,608 మంది గ్రామ మహిళా సంఘాల సహాయకులకు లబ్ధి చేకూరనున్నది. యునిఫాంకోసం నిధుల విడుదలకు. రెన్యూవల్ విధా తన సవరింపునకు అనుమతి ఇవ్వడంతో పాటు జీవిత బీమా అమలు చేయాలనే విజ్జప్తికి సానుకూలంగా ముఖ్యమంత్రి స్పందించారు. ఈ మేరకు మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై ప్రకటించాలని మంత్రి హరీశ్‌రావును సిఎం ఆదేశించారు.
మహిళా సంఘాల ప్రతినిధులకు ఉత్తర్వుల కాపీని అందజేత..
మహిళా సంఘాల ప్రతినిధులతో గురువారం భేటీ అయిన మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయాలు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. జీతాలు పెంచుతూ జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వుల పత్రాలను మహిళా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితారెడ్డి, సత్యవతీ రాథోడ్ లతో కలిసి మహిళా సంఘాల సహాయకులతో హరీశ్‌రావు సమావేశమయ్యారు. హర్షాతిరేకాలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..మంత్రులకు రాఖీలు కట్టి తమ విఒఎ ప్రతినిధులు కృతజ్జత తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోని తమను ఆదరిస్తూ ఆసరానందిస్తూ భరోసాగా నిలిచినందుకు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని వెల్లడించారు.
వేతన పెంపుతో ఏడాదికి రూ. 106 కోట్లు..
రక్షాబంధన్ కానుకగా,రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల వేతనాలను పెంచా లని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయంతో వీరి వేతనాలు నెలకు రూ. 8000కు పెరగనున్నాయి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 17,608మంది ఐకెవి మహిళా సం ఘాల సహాయకులకు లబ్ధి చేకూరనున్నది. పెంచిన వేతనాలు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తాయి. వేతన పెంపు ద్వారా ఏడాదికి రూ. 106 కోట్లు ప్రభుత్వ ఖజా నా పై అదనపు భారం పడనున్నది. యూనిఫాం డ్రెస్ విధానాన్ని అనుసరిస్తామని, అం దుకోసం నిధులు విడుదల చేయాలని మహిళా సంఘాల సహాయకుల అభ్యర్థన మేరకు ఏడాదికి రూ.2 కోట్లు నిధులను అందించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.

మహిళా సంఘాల సహాయకుల విధులకు సంబంధించి, ప్రతి మూడు నెలలకు ఒక సారి చేసే రెన్యూవల్ విధానాన్ని ఇక నుంచి ఏడాదికి చేసేలా సవరించాలని సిఎం నిర్ణయించారు. జీవిత బీమా అందించాలని విజ్జప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇందు కు సంబంధించిన విధి విధానాలను అధ్యయనం చేసి నివేదిక అందించాలని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ముఖ్యమంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితారెడ్డి, సత్యవతి రాథోడ్, పిఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈవో గౌతమ్ పొట్రు, పలువురు విఓఎ మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News