Monday, December 23, 2024

విఓఎలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి…

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డిః విఓలను ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, 8ఏళ్లుగా విఓల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఐకెపి విఓఎల సంఘం రాష్ట్ర నాయకురాలు అనిత అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని వెలుగు కార్యాలయం ముందు విఓఎల సమ్మెలో భాగంగా బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చాలీ చాలనీ జీతాలతో పనిచేస్తున్న విఓఎలకు 26వేల జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐకెపి విఓఎలు భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, మంగ, రోషన్, సుధాకర్, సత్యమ్మ, జ్యోతి, సత్యమ్మ, అనిత తదితరులున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News