Monday, January 20, 2025

ఆర్టీసీలో ఒకేషనల్ కోర్సులు

- Advertisement -
- Advertisement -

Vocational Courses in RTC: Chairman Bajireddy Govardhan

పదో తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి : చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

హైదరాబాద్ : రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒకేషనల్ జూనియర్ కళాశాలలో కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మెడికల్ లాబరేటరీ టెక్నాలజీ (ఎంఎల్‌టి), ఫిజియోథెరపీ (పిటి),మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ( ఎంపిహెచ్‌డబ్లూ ఫిమేల్ )- కోర్సులకు పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాల కోసం టిఎస్ ఆర్టీసి తార్నాక ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఫోన్ నంబర్లు 7382835579, 9573637594లో సంప్రదించాలని కోరారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం క్యాంటీన్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News