Monday, December 23, 2024

సింగరేణి సేవా సమితి ఆద్వర్యంలో మహిళలకు వృత్తి శిక్షణలు

- Advertisement -
- Advertisement -

కాసిపేట: సింగరేణి సేవా సమితి ఆద్వర్యంలో మహిళలకు వృత్తి శిక్షణలో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ తెలిపారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషియన్, మగ్గం వర్క్‌లపై వృత్తి శిక్షణ మూడు నెలల పాటు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.

మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలోని సేవా సమితి సెంటర్‌లో నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కోర్సులకు ధరఖాస్తు చేసుకునే వారు సింగరేణి ఉద్యోగుల భార్య, పిల్లలు, మాజీ కార్మికుల భార్య, పిల్లలు, భూనిర్వసితులు, మందమర్రి ఏరియాలోని కెకె ఓసిపి, ఆర్‌కె ఓసిపి, రామకృష్ణాపూర్, శ్రావణ్‌పల్లి ఓసిపి, చుట్టు ప్రక్కల గ్రామాల మహిళలు శిక్షణ కొరకు ధరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

ధరఖాస్తులు జిఎం కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్‌మెంట్ సింగరేణి సేవా సమితిలో లభిస్తాయని ఆయన తెలిపారు. ఈనెల 20వ తేది వరకు చివరి తేది, వివరాలకు 7032878575, 9703279787లో సంప్రదించాలని పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News