Tuesday, September 17, 2024

తగ్గిన వొడాఫోన్ నష్టాలు

- Advertisement -
- Advertisement -

Vodafone Idea loss narrows to Rs 4540 crore

ముంబయి: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టెలికాం దిగ్గజ సంస్థ వొడాఫోన్ ఐడియా నష్టాలు గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే తగ్గాయి. ఇండస్ టవర్స్‌లో తన వాటాను సంస్థ విక్రయించడమే ఈ నష్టాలు తగ్గడానికి కారణం. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ నష్టాలు రూ.4,532 కోట్లకు తగ్గాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నష్టాలు రూ.6,438 కోట్లుగా ఉన్నాయి. కాగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కంపెనీ నికర రాబడి 1.7 శాతం తగ్గి రూ.10,894 కోట్లుగా ఉంది. అయితే కార్యకలాపాల పరంగా ఈ త్రైమాసికం ఈ రంగంలోని మిగతా కంపెనీలతో పోలిస్తే కంపెనీకి బలహీనంగానే ఉందని చెప్పాలి. ఈ త్రైమాసికంలో ప్రధాన పోటీదారయిన ఎయిర్‌టెల్ చందాదారుల సంఖ్య 14.2 మిలియన్లు పెరగ్గా, వొడాఫోన్ చందాదారుల సంఖ్య 20 లోల మేర తగ్గింది. అయితే 4జి చందాదారుల సంఖ్య మాత్రం పెరగడం గమనార్హం. కాగా ఈ త్రైమాసికంలో వొడాఫోన్ యుపి లాంటి కొన్ని ఎంపిక చేసిన సర్కిళ్లలో తన టారిఫ్‌లను పరిమితంగా పెంచింది. అయితే దీనివల్ల కంపెనీ రాబడి పెద్దగా పెరగలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News