న్యూఢిల్లీ: దేశంలో 5 జి సేవలను అందుబాటులోకి తీసుకు రావడంలో భాగంగా జరుగుతున్న ట్రయల్స్‌లో ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. పుణెలో నిర్వహించిన 5జి ట్రయల్స్‌లో3.7 గిగా బిట్‌పర్ సెకన్ (జిబిపిఎస్) వేగంతో డేటాను బదిలీ చేసినట్లు ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గాంధీనగర్, పుణెలో మిడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌లో నిర్వహించిన ట్రయల్స్‌లో 1.5జిబిపిఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను అందుకున్నట్లు తెలిపింది. ఇతర ఆపరేటర్లతో పోలిస్తే ఇదే అత్యంత వేగం కావడం గమనార్హం. దేశంలో 5 జి ట్రయల్స్‌కు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాకు టెలికాం శాఖ( డాట్) గత మేలో అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆరు నెలలు పాటు ఆయా టెలికాం కంపెనీలు ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగా వొడాఫోన్‌కు సంప్రదాయ 3.5జిహెచ్ జడ్ స్పెక్ట్రమ్‌తో పాటు 26 గిగాహెర్జ్ హైఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను డాట్ కేటాయించింది. పుణెలో నిర్వహించిన ట్రయల్స్‌లో 3.7 జిబిపిఎస్ వేగాన్ని తక్కువ లేటెన్సీతో అందుకొన్నట్లు విఐ ఒక ప్రకటనలో తెలిపింది.