Sunday, December 22, 2024

యువకుడి కడుపులో వోడ్కా బాటిల్… ఎలా వెళ్లిందబ్బా? 

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: నేపాల్‌కు చెందిన ఒక 26 ఏళ్ల యువకుడి కడుపులో నుంచి వోడ్కా బాటిల్‌ను ఆపరేషన్ చేసి బయటకు తీశారు వైద్యులు. ఇందుకు సంబంధించి ఒక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్‌లోని రౌతహత్ జిల్లా గజారా మున్సిపాలిటీలో ఈ సంఘటన ఇటీవల చోటుచేసుకుంది. కడుపు నొప్పిగా ఉండడంతో నర్సద్ మన్సూరీ అనే 26 ఏళ్ల వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ అతడికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతడి కడుపులో ఒక మద్యం బాటిల్ ఉన్నట్లు గుర్తించారు.

రెండున్నర గంటలపాటు సర్జరీ చేసి అతడి కడుపులో ఉన్న వోడ్కా బాటిల్‌ను విజయవంతంగా బయటకు తీశారు. ఈ బాటిల్ కారణంగా అతడి ప్రేగులు చిట్లపోయాయని, అయితే అతడి ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదని డాక్టర్లు తేల్చారు. బాగా మద్యం తాగించి అతడి స్నేహితులే పురీష్ ద్వారము ద్వారా బాటిల్‌ను జొప్పించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నర్సద్ స్నేహితులలో ఒకడైన షేక్ షమీమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నర్సద్ స్నేహితులలో కొందరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News