Tuesday, November 5, 2024

ఐస్‌ల్యాండ్‌లో బద్దలైన అగ్నిపర్వతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :ఐస్‌ల్యాండ్‌లో గత డిసెంబర్ తరువాత మూడోసారి ఈనెల 8న అగ్నిపర్వతం బద్దలైంది. ఈ విస్ఫోటనం వల్ల అనేక అవాంతరాలు తలెత్తాయి. ఐస్‌ల్యాండ్ లోని ఫాగ్రాడాల్స్‌ఫ్జాల్ అనే అగ్ని పర్వతం ఒక్కసారి పేలడంతో శిలలు కరిగి నదులుగా ప్రవహించాయి. ఈ దృశ్యాన్ని కొపెర్నికస్ సెంటినెల్ 2 శాటిలైట్ చిత్రీకరించ గలిగింది. మంచుగడ్డలకు భిన్నంగా ఈ అగ్నిపర్వతం నుంచి అత్యంత వేడి నీళ్లు పెల్లుబికాయి. దాదాపు 20,000 కుటుంబాలకు వేడి నీళ్లు సరఫరా అయ్యాయి. ఈ ప్రమాదానికి ప్రజలు భయపడుతుండడంతో రెక్జానెస్ ద్వీపకల్ప ప్రాంతం అంతా అత్యవసర పరిస్థితిని సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకటించింది.

పర్వతం పేలుడు ప్రారంభమైన పది గంటల తరువాత శాటిలైట్ ఆ దృశ్యాన్ని చిత్రీకరించింది. దాదాపు 800 ఏళ్లు సుషుప్తావస్థలో ( నిద్రాణ స్థితి) ఉన్న ఈ అగ్నిపర్వతం 2021 మార్చి నుంచి వరుసగా ప్రతి ఏటా పేలుళ్లతో భయపెడుతోంది. పేలుడు జరిగిన ప్రతిసారీ జెల్డింగడలూర్ లోయకు కొత్త మార్గం ఏర్పడుతోంది. వెళ్లడానికి నేలపై ఎలాంటి దారులు లేని ఇలాంటి ప్రాంతాల్లో ఈ విధమైన ప్రకృతి వైపరీత్యాలను సమీక్షించడానికి కొపర్నికస్ సెంటినెల్ శాటిలైట్లు ముఖ్యమైన సాధనాలు అవుతాయి. ప్రకృతి వైపరీత్యాల ప్రతిస్పందన బృందాలకు, పరిశోధకులకు కీలకమైన సమాచారాన్ని ఈ శాటిలైట్లు అందిస్తుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News