న్యూఢిల్లీ : భారత్‌లో ఫోక్స్ వ్యాగన్ తన లేటెస్ట్ విర్టస్ సెడాన్‌ను లాంచ్ చేసింది. కంఫర్ట్లైన్, హైలైన్, టాప్‌లైన్ వంటి నాలుగు ట్రిం ఆపన్స్‌లో లభించే విర్టస్ రూ .11.22 లక్షల నుంచి రూ. 17.92 లక్షల మధ్య అందుబాటులో ఉంటుంది. విర్టస్ కోసం ఫోక్స్‌వ్యాగన్ ఎంక్యూబీ-ఏఓ-ఐఎన్ ప్లాట్‌ఫాంను ఉపయోగించి లేటెస్ట్ వెహికల్‌ను డెవలప్ చేసింది. వోక్స్వ్యాగన్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌తోపాటు ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంపులు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఎస్‌యువీ టైగున్ తరహాను పోలిఉండేలా విర్టస్ ఇంటీరియర్ లేఅవుట్‌ను డిజైన్ చేశారు. 10 ఇంచ్ ఇన్ఫోటెయిన్‌మెంట్ డిస్‌ప్లే, వైర్లెస్ అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి పీచర్లు జోడించారు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లైస్ స్మార్ట్‌ఫోన్ చార్జర్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, మల్టీ కొలిజన్ బ్రేక్స్, టైర్ డిఫ్లేషన్ వార్నింగ్ వంటి 40కిపైగా సేఫ్టీ ఫీచర్లను జోడించారు.స్కోడా స్లేవియా, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్ వంటి కార్లకు వోక్స్‌వ్యాగన్ విర్టస్ దీటైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
దేశీ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ విర్టస్ లాంచ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -