Wednesday, January 22, 2025

సిఇసి, ఇసి పొదుపు చర్యలు…

- Advertisement -
- Advertisement -

సిఇసి, ఇసి పొదుపు చర్యలు… భత్యాలు వదులుకోవాలని నిర్ణయం

Voluntarily give up perks as part of austerity measure

 

న్యూఢిల్లీ: పొదుపు చర్యలలో భాగంగా తమ భత్యాలు, సౌకర్యాలను స్వచ్ఛందంగా వదులుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి) రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. తమకు లభించే భత్యాలపై ఆదాయం పన్ను మినహాయింపులను ఉపయోగించుకోరాదని, తమకు ఏటా లభించే మూడు లీవ్ ట్రావెల్ కన్సెషన్స్(ఎల్‌టిసి)లో రెండింటిన వదులుకోవాలని కూడా వారిద్దరూ నిర్ణయించినట్లు ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. గత వారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్ శుక్రవారం మొట్టమొదటిసారి ఎన్నికల కమిషన్ సమావేశాన్ని ఎన్నికల కమిషనర్ పాండేతో కలసి నిర్వహించారు. ప్రస్తుతం ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌లో ఒక స్థానం ఇంకా భర్తీ కావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News