Sunday, January 19, 2025

యాదగిరిగుట్టలో స్వచ్ఛంద బంద్

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని బస్టాండ్ ను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ వ్యాపారస్తులు, రాజకీయ పార్టీల ప్రజాసంఘాల ఐక్యకారచరణ కమిటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం ఉదయం నుంచి స్వచ్ఛందంగా బంధు నిర్వహించారు. గత 50 సంవత్సరాల క్రితం పట్టణ ప్రజల ప్రయాణ సౌకర్యం, భక్తుల సౌకర్యం కోసం ముఖ్యంగా పట్టణ అభివృద్ధి కోసం ఆనాటి పెద్దలు అన్ని విధాలుగా ఆలోచించి అప్పుడు బస్టాండ్ ఏర్పాటు చేశారని, గత 50 సంవత్సరాలుగా దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజుకి బస్టాండ్ ఆధారంగా 2000 నుండి 3000 మంది కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు. పట్టణంలోని 12 వార్డుల ప్రజలకు ఈ బస్టాండ్ సౌకర్యంగా ఉందని ప్రభుత్వం తరలించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని యధావిధిగా కొనసాగించాలని ఈసందర్భంగా వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News