Thursday, January 23, 2025

వరంగల్‌లో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు

- Advertisement -
- Advertisement -
  • అక్రమంగా లింగనిర్ధారణ, గర్బస్రావాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
  • వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్

వరంగల్ క్రైం : వరంగల్‌లోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగిస్తుండటంతో పోలీసులు నిఘా పెట్టి లింగనిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18మందిని అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ తెలిపారు. కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌పూర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో ఎలాంటి వైద్య, విద్య అర్హతలు లేకున్నా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ అవసరమైన వారికి గర్బస్రావాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన 18మంది నిందితులను యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్‌పోర్స్ యూసీ పోలీసులు అరెస్టు చేయడంతో పాటు నిందితుల నుండి మూడు లింగ నిర్ధారణకు వినియోగించే స్కానర్లు, 18 సెల్‌ఫోన్‌లు, రూ.73వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, బాల్నె పార్దు, మోరం అరవింద, మోరం శ్రీనివాస్‌మూర్తి, బాల్నె పూర్ణిమ, వార్ని ప్రదీప్‌రెడ్డి, కైత రాజు, కల్లా అర్జున్, డి.ప్రణయ్‌బాబు, కీర్తి మోహన్, బాల్నె ఆశలత, కొంగర రేణుక, భూక్య అనిల్, చెంగెల్లి జగన్, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాసిరాజు దిలీప్‌లతో పాటు మరో కొంతమంది ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్పారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లింగనిర్ధారణకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్‌పోర్స్, జిల్లా వైద్య విభాగాలతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి లింగనిర్ధారణకు పాల్పడుతున్న 18మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు వేముల ప్రవీణ్ గతంలో స్కానింగ్ కేంద్రంలో టెక్నిషన్‌గా పని చేసిన అనుభవం ఉండటంతో పాటు గతంలో అక్రమంగా లింగనిర్దారణకు పాల్పడటంతో హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కొక్క గర్భస్రావానికి రూ.20వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేసేవారు. ఇప్పటి వరకు ఈ ముఠా వందకు పైగా గర్భస్రావాలకు పాల్పడినట్లుగా గుర్తించడం జరిగిందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News