Sunday, December 22, 2024

అందుబాటులో ఉండే నాయకులకే ఓటు వేయండి

- Advertisement -
- Advertisement -

ముత్తారం: దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతంగా కొనసాగుతుందని అభివృద్ధి అనేది, బిఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దు గ్రామాలై న ఖమ్మంపల్లి, తాడిచెర్ల గ్రామాలను కలుపుతూ మానేరు వాగుపై నిర్మించిన బ్రిడ్జితోపాటు గ్రామంలో రూ.4 కోట్లతో నిర్మించే రోడ్డుకు భూ మి పూజను ఎంపీ బోర్లకుంట వెంకష్‌తో కలిసి ఆయన ప్రారంభించారు

. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మా ట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తు తెరిగి తీర్చడమే నాయకుల లక్షణమని ఆ లక్షాణలు జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్‌లో పుష్కలంగా ఉ న్నాయన్నారు. నిత్యం అభివృద్ధి కాంక్షించే వ్యక్తిని కాదని ప్రజలు తీర్పు నిచ్చినా, జడ్పీ చైర్మన్ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంథని అభివృద్ధి కి పుట్ట మధుకర్ చొరవ చూపడం జరుగుతుందన్నారు.

పుట్ట మధుకర్ ఎమ్మెల్యేగా గెలిచి ఉం ఈ ప్రాంతం మరింత అభివృద్ధి సాదించేద న్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా కూడా అమలు కావడ లేదన్నారు. రాబోయేది మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభు త్వమేనని అన్నారు. ప్రజల కష్టాలలో తోడుగా ఉండే వారికి మాత్రమే ఓటు వేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీలు జక్కుల ము త్తయ్య, కొండ శంకర్, జడ్పీటీసీలు చెలకల స్వర్ణలత అశోక్ కుమార్, తగరం సుమలత శంకర్ లాల్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోతి పెద్ది కిషన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాయలింగు, పీఎసీఎస్ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు అత్తె చం ద్రమౌళి, సర్పంచ్‌ల ఫోరం మండల కన్వీనర్ నూనె కుమార్, మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News