- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పాలనతో 10 ఏళ్ల మోడీ పాలనను పోల్చుకుని బిజెపికి ఓటేయాలని ఓటర్లను కోరారు. వారు పేదలకు బ్యాంకు ఖాతాలు ఎందుకు అని హేళన చేశారన్నారు. ప్రస్తుతం పేదలు దాదాపు రూ. 2 లక్షల కోట్లు పొదుపు చేశారు. గతంలో నిరర్ధక ఆస్తులు చాలా ఉండేవి. బిజెపి ప్రభుత్వం వచ్చాక 55 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ హయాంలో ద్రవ్యోల్బణం 12 శాతానికి పైగా ఉండేది. మోడీ వచ్చాక 500 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించారన్నారు. మహిళలకు 33 శాతం కోటా ఇచ్చారని, హైవేలు నిర్మించారని, వ్యవసాయ వృద్ధికి సాయమందించారని, అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారని అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనేక అంశాలపై మాట్లాడారు.
- Advertisement -