Tuesday, December 24, 2024

సుపరిపాలన కోసం ఓటును తమ హక్కుగా భావించాలి

- Advertisement -
- Advertisement -
  • అడిషనల్ కలెక్టర్ ఆర్వోమినిత్ మిట్టల్

అమరచింత: అమరచింత పట్టణ కేంద్రంలో గురువారం బి ఎల్ ఓ ల ఇంటింటి వెళ్లి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. నారాయణపేట అడిషనల్ కలెక్టర్ ఆర్వోమినిత్ మిట్టల్ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరు ఓటరు గా నమోదు చేసుకోవడమే కాకుండా దానిని సద్వినియోగం చేసుకోవడం ద్వారానే సుపరిపాలన ఆశించవచ్చని ఆయన అన్నారు.

ఓటు ప్రాధాన్యతపై అవగాహన అవసరం అని అన్నారు. పట్టణ కేంద్రంలో అన్ని వార్డులలో కొత్త ఓటరు నమోదు కార్యక్రమం వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చాంద్ పాషా సిబ్బంది బిఎల్వోలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News