Sunday, December 22, 2024

తమ్ముడికి ఓటెయ్యండి

- Advertisement -
- Advertisement -

మునుగోడు బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కోసం
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యర్థన

స్థానిక నేతతో ఫోన్‌లో మంతనాలు
పిసిసి ప్రెసిడెంట్ పదవి ఇక తనకేనని
వ్యాఖ్య చేసి కాంగ్రెస్‌ను
అధికారంలోకి తెస్తానని ధీమా సోషల్
మీడియాలో వెంకట్‌రెడ్డి అడియో
హల్‌చల్ కాంగ్రెస్ అధిష్ఠానం
సీరియస్ పిసిసిలో తీవ్ర చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఎన్నికల్లో పార్టీ చూడకుండా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటేయాలని కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడినట్టు గా ఆడియో సంభాషణ ఉంది. ఈ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిసిసి చీఫ్‌గా తాను ఎన్నికై రాష్ట్ర వ్యాప్తం గా పాదయాత్ర నిర్వహించనున్నట్టు గా చెప్పారు. అంతేకాదు, పార్టీని అ ధికారంలోకి తీసుకు వస్తానని ప్రక టించారు. అయితే ఈ ఆడియో కోమటిరెడ్డి వెంకట్ రెడ్దిదా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం కోమటిరె డ్డి వెంకట్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెం కట్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. తనను పిసిసి చీఫ్ పదవి త ప్పించే కుట్ర జరుగుతుందని రేవంత్ రెడ్డి గురువారం ఆరోపించారు. మీ డియాతో మాట్లాడుతున్న రేవంత్ రె డ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరునాడే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో కలకలం రేపింది.

గతంలో కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో లీకైంది. రాజగోపాల్ రెడ్డికి మద్దతివ్వాలని వెంకట్ రెడ్డి కోరిన విషయం కూడ అప్పట్లో కలకలం రేపిన సంగతి విదితమే. పిసిసి చీప్ రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్‌లు గతంలో తనపై చేసిన విమర్శల కారణంగా మునుగోడు ప్రచారానికి దూరంగా ఉండాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. అయితే పార్టీలో కొందరు నేతల మధ్య సమన్వయం లేని కారణంగా పార్టీకి ఇబ్బందికరంగా మారింది.మరో వైపు వెంకట్ రెడ్డి ఆడియో ప్రస్తుతం పార్టీలో చర్చకు దారి తీసింది. మునుగోడులో ప్రచారానికి రావాలని పాల్వాయి స్రవంతి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరారు. అయితే పాల్వాయి స్రవంతికి తన ఆశీర్వాదాలుంటాయని ఆయన హామీ ఇచ్చారు. ప్రచారానికి వచ్చే విషయమై ఆలోచిస్తానని తనకు చెప్పారని స్రవంతి ఇటీవలనే మీడియాకు చెప్పారు. కానీ పార్టీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని ప్రచారానికి దూరంగా ఉండాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఫిర్యాదు

మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధికి ఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పినట్టుగా ఉన్న ఆడియోపై ఎఐసిసికి నేతలు ఫిర్యాదు చేశారు. ఎస్‌సి సెల్ నేత ప్రీతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విజయం సాధించిన మల్లికార్జున ఖర్గేకి ,ఎఐసిసి తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్న వైరివర్గం ఈ ఆడియో అంశాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకొనే అవకాశం లేకపోలేదు.

నా అన్నపై దుష్ప్రచారం.. వెంకట్‌రెడ్డి ఆడియోపై రాజగోపాల్ రెడ్డి

తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కైందన్నారు. కాంగ్రెస్ నాయకుడైనా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు టిఆర్‌ఎస్‌కు చెందిన చాలా మంది నాయకులు తాను గెలవాలని కోరుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News