- Advertisement -
హైదరాబాద్: బిసిల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బిసి కుల గణన చేయమంటే కేంద్ర ప్రభుత్వం చేయమంటోందన్నారు. బిసిలకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలేంటో చెప్పాలని నిలదీశారు. బిజెపి చరిత్ర ఎస్సి, ఎస్టి, బిసిలకు వ్యతిరేకమన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పేద ప్రజలు కన్నీరు పెడుతున్నారని మండిపడ్డారు. బిసి బిడ్డల కోసం బిజెపి ప్రభుత్వం ఒక్క బిసి హాస్టల్ కూడా కట్టలేదన్నారు. సిఎం కెసిఆర్ బిసి విద్యార్థులకు గురుకులాలు ఏర్పాటు చేశారని, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నన్ని పథకాలు మరే రాష్ట్రంలో అమలుకావడం లేదన్నారు. బిసి జాతికి అన్యాయం చేస్తున్న బిజెపికి ఓటు వెయ్యొద్దని హుజూరాబాద్ ప్రజలకు ఆర్ కృష్ణయ్య సూచించారు.
- Advertisement -