Monday, January 20, 2025

ఓట్ల కోసం తాయిలాల సంస్కృతి దేశానికి ప్రమాదకరం : ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఓట్ల కోసం తాయిలాలిచ్చే సంస్కృతి దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరమని, ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ లోని జలౌన్ జిల్లా , ఓరాయ్ సమీపం లోని కైతేరి గ్రామంలో నాలుగు లేన్ల బుండేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే ను ప్రారంభించిన తరువాత జరిగిన సభలో శనివారి ఆయన మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో రహదారుల అనుసంధానం లేకపోవడానికి కారణం గత ప్రభుత్వాలేనని చెప్పారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకే పార్టీ బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయని, ఇవి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలని అన్నారు. అనుసంధానం వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో రాష్ట్రం గొప్పగా పరివర్తన చెందుతోందన్నారు. బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే వల్ల చిత్రకూట్ ఢిల్లీ మధ్య ప్రయాణ దూరం తగ్గడంతో మూడు నుంచి నాలుగు గంటల సమయంఆదా అవుతుందని పేర్కొన్నారు.

అయితే ఈ ఎక్స్‌ప్రెస్ వే వల్ల కలిగే ప్రయోజనాలు అంతకన్నా ఎక్కువ అని వివరించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే కేవలం వాహనాల వేగాన్ని పెంచడం మాత్రమే కాకుండా యావత్తు బుండేల్‌ఖండ్‌లో పారిశ్రామిక అభివృద్ధి పుంజుకుంటుందని తెలిపారు. తాయిలాల సంస్కృతి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ గొప్పగా పరివర్తన చెందుతోందని, శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని, రహదారుల అనుసంధానం వేగంగా మెరుగుపడుతోందని చెప్పారు. గతంలో వీటి పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలని ప్రజలను కోరారు. ఉత్తరప్రదేశ్‌లో ఏడు జిల్లాల మీదుగా బుండేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించారు. దీనికి రూ. 14,850 కోట్లు ఖర్చయింది. 2020 ఫిబ్రవరిలో దీనికి మోడీ శంకుస్థాపన చేయగా, 28 నెలల్లో దీని నిర్మాణం పూర్తయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News