Thursday, January 23, 2025

ధైర్యంగా ఓటేయండి… మేమున్నాం

- Advertisement -
- Advertisement -
  • జిల్లా ఎస్పీ గాష్ ఆలం

ములుగు జిల్లా ప్రతినిధి: ఓటు మీ హక్కు, ధైర్యంగా ఓటేయండి మేమున్నాం అని జిల్లా ఎస్పీ గాష్ ఆలం అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ములుగు జిల్లాలో ప్రజలను ఓటు వేయమని ప్రోత్సహించేందుకు వారిలో నమ్మకం కలిగేలా బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ, సిఆర్ఫీఎఫ్ భద్రత బలగాలు సంయుక్తంగా జిల్లా ఎస్పీ గాష్ ఆలం, ఓఎస్డీ అశోక్ కుమార్‌ల ఆధ్వర్యంలో ప్లాగ్ మార్చ్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల దృష్టా ప్రజలలో చైతన్యం నింపేందుకు ఓటు వేయడానికి వారిని ప్రోత్సహించేందుకు జిల్లా పోలీసులు, సీఆర్ఫీఎఫ్ బలగాలతో ప్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని, మావోయిస్టులు, ఇతర అసాంఘిక శక్తులు ప్రజలను పోలింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా పౌరులను నిరుత్సాహపరిచే అవకాశం ఉన్నందున ఎన్నికల సమయంలో తిరుగుబాటు కార్యకలాపాలు పెరగకుండా ప్లాగ్ మార్చ్‌ను నిర్వహించామని తెలిపారు.

ప్రజల్లో విశ్వాసం నింపేందుకు సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ (సిఆర్ఫీఎఫ్) బలగాలతో ప్లాగ్ మార్చ్ నిర్వహించడం పట్ల ప్రజలలో విశ్వాసం, నైతికతను పెంచుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్లాగ్ మార్చ్ నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఎన్నికల సమయంలో మావోయిస్టుల నుండి ముప్పు పొంచి ఉన్నందున ఖచ్చితంగా మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుందని, పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుందని ఇది రాజ్యాంగం పట్ల ఎన్నిక ప్రక్రియ పట్ల సానుకూల సందేశాన్ని ఇస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందం, సిఆర్పీఎఫ్ కమాండెంట్ రూడీ వారిఘీసే, ములుగు డిఎస్పీ రవిందర్, సిఐ మేకల రంజిత్ కుమార్, టాస్క్‌ఫోర్స్ సిఐ దయాకర్, పస్రా సిఐ శంకర్, ఆర్‌ఐ అడ్మిన్ సతీష్, ఆర్‌ఐ ఆపరేషన్స్ సంతోష్, వెంకటాపూర్, పస్రా ఎస్సైలు చల్ల రాజు, షేక్ మస్తాన్, ఎస్సై తాజోద్ధీన్, సిఆర్ఫీఎఫ్, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News