Monday, December 23, 2024

ఓటర్ల జాబితా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

గద్వాల : ఓటర్ల జాబితా ఇంటింటి సర్వేలో భాగంగా జాబితా పూర్తి చేయాలని బిఎల్‌ఓలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. శుక్రవారం గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలో ఇంటింటి సర్వేలో పాల్గొని కలెక్టర్ స్వయంగా ఇంటింటి సర్వే చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంటి యజమానులతో మాట్లాడుతూ ఇంటిలో ఎంత మంది ఉన్నారు. 18 సంవత్సరాల వయసు వారు ఎంత మంది ఉన్నారు.

ఓటర్ నమోదు చేయించుకున్నారా , తదితర ప్రశ్నలు వేసి యాప్‌లో నమోదు చేసిన వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్లను నమోదు చేసి నివేదిక పంపాలని పంచాయతీ కార్యదర్శి ఆదేసించారు. సర్వేలో పాల్గొన్న అంగన్‌వాడీ టీచర్ సెల్లులో కలెక్టర్ యాప్ ఓపెన్ చేయించి ఓటరు నమోదు విధానం చూశారు.

ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులు తదితర పూర్తి వివరాలు పొందుపర్చి పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం పెంచికల పాడు గ్రామంలోని ప్రభుత్వ భూమి 7 ఎకరాల 38 గుంటల భూమిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గతంలో ఈ భూమిలో 48 కుటుంబాల వారికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగినా పోజిషన్ చూపనందున ఆ స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి వెంటనే సర్వే చేసి నివేదిక పంపాలని తహసీల్దార్‌కు ఆదేశించారు. తదనంతరం తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News