భద్రాద్రి కొత్తగూడెం : 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరిని ఓటర్ జాబితాలో నమోదయ్యే విధంగా రూపొందించిన జాబితా ఏమైనా సవరణలో ఉంటే సరిచూసుకుని పకడ్భందీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. మంగళవారం ఐడివోసి కార్యాలయంలో ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు ఎలక్షన్ డిటీలతో ఓటర్ జాబితా సవరణలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి జనవరి, ఒకటి ఏప్రిల్, ఒకటి జూలై, ఒకటి అక్టోబర్ వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరిని గ్రామాలు, వార్డుల వారీగా ఇంటింటికి తిరిగి ప్రతీ ఒక్కరిని ఓటు హక్కు కల్పించే విధంగా జాబితాలో వారు పేర్లు నిర్ణిత ఫారంలో నమోదు చేయాలని అన్నారు.
ఇంటింటి సర్వేలో ఒక ఇంట్లో ఆరు ఓట్లు కంటే ఎక్కువ ఉంటే నిర్ణిత ఫారంలో అదనంగా ఉన్న ఓట్లను నమోదు చేయాలని, ఇదివరకు ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి ఓట్లు ఏమైనా ఉంటే సంబంధిత కుటుంబ సభ్యులను సంప్రదించి డెత్ సర్టిఫికెట్ ఆధారంగా వారి పేర్లు తొలగించాలని, అదేవిధం గా బూత్‌ల వారీగా ఓటర్ల మార్పు జరిగితే నిర్ణీత ఫారంలో వారి పేర్లు నమోదు చేయాలని, కొత్తగూడెం భద్రాచలంలో పోలింగ్ బూత్‌లలో 1500 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే ఇంకో పోలింగ్ బూత్ ఏర్పాటు కోసం సంబంధిత నిర్ధేశించిన ఫారంలో పొందుపరచాలని సూచించారు. పినపాక, అశ్వాపురం, కరకగూడెం, బూర్గంపాడు, ఆళ్లపల్లి, మండలాల్లో ఓటర్ల నమోదు సంఖ్య చాలా తక్కువగా ఉందని, జులై11,12 తేదీలల్లో పూర్తి స్థాయిలో ఓటర్లు నమోదు ప్రక్రియ పూర్తి చేసి ప్రదర్శనకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీవో అశోక్ చక్రవర్తి, చీఫ్ ఎలక్షన్ నోడల్ అధికారి డిఆర్డీవో మధుసుదన్‌రావు, ఆర్డీవోలు మునిసిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.