Wednesday, January 22, 2025

పొరపాట్లకు తావులేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి

- Advertisement -
- Advertisement -
  • వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ : ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుండి అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి అన్ని మండలాల తాసిల్దారులతో ఓటరు జాబితా రూపకల్పనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై, 13 నాటికి డబల్ ఒటర్లు, చనిపోయిన వారు లేని ఓటర్ జాబితాను సిద్ధం చేయాలన్నారు.

ఇం దుకు గాను ప్రతివారం పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు వివి ధ పార్టీల ప్రతినిధుల అన్ని వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు. బిఎల్ ఓలు, సూపర్‌వైజర్లు అందరూ విధులలో చురుకుగా పనిచేసేలా చూసుకోవాలని తహసీల్దార్లకు సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో బిఎల్‌ఓలు పనిచేయాలని, ఖాళీలు ఏర్పడితే వెంటనే భర్తీ చేసుకోవాలని అన్నారు.

బిఎల్‌ఓల ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి బిఎల్‌ఓ దగ్గర కొత్త గా రూపొందించిన ఓటరు జాబితా లిస్టుతోపాటు బిఎల్‌ఓ రిజిస్టర్ అందుబాటులో ఉండాలన్నారు. బిఎల్‌ఓలు, సూపర్‌వైజర్లతో అన్ని తహసీల్దార్ కార్యాలయాలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి తహసీ ల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లను ఎన్నికల విధుల నిర్వహణకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహి ంచి రెండు రోజులలో పూర్తి చేయాలని, ఈఆర్‌ఓ ఆన్లైన్ సేవలు జూలై 13 వర కు మాత్రమే పనిచేస్తుందని, ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు అన్నింటిని క్షేత్రస్థాయిలో పరిశీలించుకొని పనులు పూర్తి చేసుకోవాలన్నారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరిని గుర్తించి ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించా రు. ఈసారి ఎన్నికలలో (హోమ్ ఓటింగ్) ఇంటి దగ్గర నుండి ఓటింగ్ నిర్వహి ంచనున్నట్లు తెలుపుతూ 80 సంవత్సరాలు పైబడిన వారు, 40 శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యం గలవారికి వారి ఇంటి వద్ద నుండే ఓటింగ్ చేసుకొనే విధంగా సదుపాయం కల్పించనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. బిఎల్‌ఓలు ఇలాంటి వారి ఇండ్లకు వెళ్లి వారి ద్వారా ఫామ్ -8లో దరఖాస్తు చేయించాలన్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు వారితో ఇంటి వద్ద నుండి ఓటింగ్ చే యించడం జరుగుతుందన్నారు. రాబోవు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహి ంచేందుకు తహసీల్దార్లందరూ పూర్తి బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News