- మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా
కౌడిపల్లి: తప్పులు లేకుండా ఓటరు జాబితా తయారు చేయాలని ఓటు హకు అందరి బాధ్యత అంటూ మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ఓటరు స వరణ కార్యక్రమం, బూత్ లెవల్, బిఎల్‌ఓలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ హాజరై మాట్లాడుతూ ఓటరు సవరణ పారదర్శకంగా ఉండాలి తప్ప రాజకీయాలతో పనిచేయవద్దన్నారు. ప్రజలతో రాజకీయ నా యకులతో కలిసిమెలిసి ఉంటూ ఓటరు సవరణ నిర్వహించాలన్నారు. 18 సంవత్సరాల యువతీ, యువకులకు 20 నుంచి 29 సంవత్సరాల వారికి ఖచ్చితంగా ఓటు హక్కు కలిగి ఉండే విధంగా జాబితా తయారు చేయాలన్నా రు. ఇతర జిల్లాల్లో చదువుకునే, బతుకుదెరువు కోసం వెళ్లిన వారు ఓటరు జాబితా కూడా నమోదు చేయాలన్నారు. ముఖ్యంగా సదరన్ క్యాంపులో వికలాంగుల మెరిట్ ప్రకారం ఓటరు లిస్టు తప్పులు లేకుండా సవరించాలన్నారు. వికలాంగులకు ఫార్మ్8 లో ఓటరు జాబితా నమోదు చేయాలన్నారు.
ఇంటింటికి అవగాహన కల్పిస్తూ ఓటర్లతో కలిసి మెలిసి ఉంటూ ఈవీఎం మిషన్లపై అ వగాహన కలిగి ఉంటే ప్రజలకు అపోహాలు తొలగిపోతాయన్నారు. ము ఖ్యంగా ఓటరు లిస్టులో జాగ్రత్తగా జాబితా తయారు చేయాలన్నారు. ఎలాంటి తప్పులు జరిగిన వారే బాధ్యత వహించాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత ఏఈఆర్‌ఓ అధికారికి తెలపాలన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వచ్చే నెల ఆగష్టు 21న అన్ని గ్రామాల ఓటరు లిస్టు బిఎల్‌ఓలకు అందజేస్తారని ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. కౌడిపల్లి మండల వ్యాప్తంగా 39 మంది బిఎల్‌ఓ, నలుగురు సూపర్‌వైజర్లు పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్‌ఓ అధికారి కమలాద్రి, ఎంపిడిఓ శ్రీనివాస్, డిప్యూటీ తహశీల్దార్ తారాబాయి, ఆర్‌ఐ శ్రీహరి, మాస్టర్ ట్రైనర్స్ సత్యనారాయణ, ప్రభాకర్‌రెడ్డి, ఆయా గ్రామాల బిఎల్‌ఓలు ఉన్నారు.