Wednesday, January 22, 2025

ఓటరు నమోదు పకడ్బందీగా చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

కోరుట్ల : ప్రభత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కోరుట్ల తహశీల్దార్ నీరటి రాజేష్ అన్నారు. కోరుట్ల మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం బూత్ లెవల్ అధికారులకు, పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ రాజేష్ మాట్లాడుతూ ఓటరు నమోదు, ఓటరు తొలగింపు, ఓటరు సవరణలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఇంటింటి సర్వేలో 18 సంవత్సరాల వయస్సు పై బడిన వారందరిని ఓటరుగా నమోదు చేసేందుకు కృషి చేయాలని రాజేష్ సూచించారు. బిఎల్‌వో యాప్‌లో వివరాలు నమోదు ప్రక్రియ సరి చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు శివప్రసాద్, కృష్ణమోహన్, చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News