Monday, November 25, 2024

అందుబాటులోకి ‘ఓటరు సహాయ మిత్ర’

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓటర్ల తో పాటు ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్ధులు, రాజకీయపక్షాలు తమ సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చుకోవడానికి వీలుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో ఒక అధునాతన సాంకేతిక సౌకర్యం… ఛాట్‌బాట్ ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం వెబ్‌సైట్- https://ceotelangana.nic.in తెరిచిన వెంటనే ఇది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఎపిక్ కార్డు, పోలింగ్ బూత్, బూత్ స్థాయి అధికారులు, ఓటర్లను నమోదు చేసుకునే అధికారులు.. ఇతరత్రా ఇటువంటి సమాచారం ఎలా, ఎక్కడ, వెతకాలో ‘ఓటరు సహాయ మిత్ర’ సూచిస్తుంది.

కొత్త ఓటరుగా నమోదు కావాలంటే, ఇప్పటికే నమోదై ఓటు ఉండి దానిలో మార్పు చేర్పులు చేసుకోవాలంటే.. ఏదైనా అంశంపై ఫిర్యాదు చేయాలనుకుంటే, పోటీలోఉన్న అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలనుకుంటే, అభ్యర్థుల అఫిడవిట్ల నమూనాలను పొందాలనుకుంటే, అటువంటి వివరాలను అందించడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. దివ్యాంగులైన ఓటర్లు వారి కోసం ఎన్నికల సంఘం అందించే వీల్ ఛైర్ వంటి ప్రత్యేక సౌకర్యాలు తెలుసుకోవడంలో కూడా ఇది వారికి మార్గదర్శిగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలోని సాంకేతిక బృందం అత్యంత తక్కువ సమయంలో ఓటర్ సహాయ మిత్ర ను రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అందించే సమాచారాన్ని కూడా ఇది అందిపుచ్చుకుని సందర్శకులకు తాజా సమాచారాన్ని అందచేయడంలో సహాయకారిగా ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News