Monday, January 20, 2025

ఓటేసిన వారి సంఖ్య జీ7 దేశాల జనాభాకు 1.5 రెట్లు: సిఇసి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ విజయవంతమైందని సిఐసి రాజీవ్ కుమార్ తెలిపారు భారత దేశంలో ఓటేసిన వారి సంఖ్య జీ7 దేశాల జనాభాకు 1.5 రెట్లు అని తెలియజేశారు. పార్లమెంట్ ఎన్నికల ముగింపుపై సిఇసి రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఏడు విడతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగిందని, ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డు అని ప్రశంసించారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు ఇంటి వద్దే ఓటు వేశారని, మీడియా సమావేశంలో లేచి నిలబడి ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

ఎన్నికల్లో చెదురుముదురు మినహా హింసాత్మక ఘటనలు జరగలేదని, కేవలం 14 చోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహించామని, 27 రాష్ట్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదని, భారత సైన్యం సహాయంతో క్లిష్టమైన ప్రాంతాల్లోనూ సజావుగా ఎన్నికలు జరిగాయని కొనియాడారు. 24 గంటల్లోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని భావిస్తున్నామని, దేశ వ్యాప్తంగా దాదాపుగా రూ.10 వేల కోట్ల విలువైన సొత్తు సీజ్ చేశామని, ఉల్లంఘనలపై సీ విజిల్‌కు 4.56 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, 90 శాతానికి పైగా ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని రాజీవ్ కుమార్ వివరించారు. కోడ్ ఉన్నా అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా చూశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News