Sunday, January 19, 2025

రాష్ట్ర ఓటర్లు..3.13 కోట్లు

- Advertisement -
- Advertisement -

1.57 కోట్ల మంది పురుష ఓటర్లు 1.56 కోట్ల మంది మహిళా ఓటర్లు , 2,226 మంది థర్డ్ జెండర్ ఓటర్లు
వచ్చే నెల 4న ఓటరు జాబితా ప్రచురణ

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల19వ తేదీ వరకు స్వీకరించిన అన్ని దరఖాస్తుల విచారణ పూర్తి చేశామని.. అక్టోబర్ 4వ తేదీన ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నెల 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చేందుకు 13.06 లక్షల దరఖాస్తులు, మరణించిన/ చిరునామా మార్పునకు 6.26 లక్షల దరఖాస్తులు, పేర్లు సవరణ కోసం 7.77 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల సంఘం పేర్కొంది.

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 14.72 లక్షల మంది ఓటర్ల జాబితాల్లో చేరగా, 3.39 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించగా, 10.95 లక్షల మంది ఓటర్ల జాబితాలోని వివరాలను సవరించినట్లు వెల్లడించారు. ఈ చేర్పులు, తొలగింపులతో, ఓటర్ల జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.13 కోట్లు కాగా 1.57 కోట్ల మంది పురుష ఓటర్లు, 1.56 కోట్ల మంది మహిళా ఓటర్లు , 2,226 మంది థర్డ్ జెండర్‌కు చెందిన ఓటర్లు ఉన్నారు. ఓటరు జాబితాలో లింగ నిష్పత్తి 994 వద్ద ఉందని వెల్లడించారు. యువ ఓటర్ల నమోదు ఐదో తేదీ జనవరి 2023 నాటికి 2.79 లక్షల నుంచి 6.51 లక్షలకు (ఈ రోజు నాటికి) పెరిగారు, ఇది 234 శాతం పెరుగుదల సిఈఓ వికాస్‌రాజ్ వెల్లడించారు. యువ ఓటర్ల వయస్సులో లింగ నిష్పత్తి 717 కావడం.. ఆందోళన కలిగిస్తుందని అధికారులు తెలిపారు. ఈ నెల 19వ తేదీ వరకు స్వీకరించిన అన్ని దరఖాస్తులను ఈ నెల 27లోగా పరిష్కరించి.. అక్టోబర్ 4వ తేదీన తుది జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితాను నిరంతరం నవీకరించే ప్రక్రియలో భాగంగా ఈ దరఖాస్తుల స్వీకరణ, పరిష్కరించడం కొనసాగుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News