యాదాద్రి భువనగిరి:ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) లపై అందరికీ ఓటర్లు అవగాహన కలిగి వుండాలని,జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు జిల్లా కలెక్టర్ దీపక్ తివారిలు సూచించారు.గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈవీఎం ప్రదర్శన ద్వారా ఓటు హక్కు వినియోగంపై ఏర్పాటు చేసిన సంచార ప్రదర్శన (మొబైల్ వాహనం) రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్,వివి ప్యాట్స్‌ల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో,భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో, ఆలేరు తాసిల్దార్ కార్యాలయంలో మొత్తం మూడు ఈవీఎం అవగాహన కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ అవగాహన కేంద్రాలలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగం, మనం వేసే ఓటు ప్రక్రియ గురించి తెలుసుకోవచ్చని అన్నారు
జిల్లాలో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి ఒకటి చొప్పున (2) మొబైల్ అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఓటు వేయు విధానంపై ప్రజలకు అవగాహన కోసం క్షేత్రస్థాయిలో మొ బైల్ వాహనాల ద్వారా ప్రచారం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల ంద రూ అవగాహన కేంద్రాలు, మొబైల్ వాహనాల ద్వారా వారి యొక్క స ందేహాలను నివృత్తి చేసుకొని నమూనా ఓటు హక్కును వినియోగించుకో వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ఏ.భాస్కరరావు, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి అమరేందర్, భువనగిరి తహసిల్దార్ వె ంకటరెడ్డి, రాజకీయ ప్రతినిధులు బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి బ ంటు రామచంద్రయ్య, జిల్లా కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెం డెంట్ ఎం.నాగేశ్వరా చారి, డిప్యూటీ తాసిల్దార్ సురేష్,శ్రీకాంత్,సిబ్బంది పాల్గొన్నారు.