Saturday, December 21, 2024

ఢిల్లీ మార్కెట్లలో ఓటర్లకు డిస్కౌంట్

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచే దిశలో ఢిల్లీలోని స్థానిక హోటళ్లు, మార్కెట్లు తాము సైతం అంటూ రంగంలోకి దిగాయి. విశేషరీతిలో ఓటు వేయండనే ప్రచారానికి దిగాయి. ఇందుకు ప్రత్యేక డిస్కౌంట్ల ఆఫర్లు ప్రకటించాయి. ఓటర్లకు డిస్కౌంట్లంటూ ఇప్పుడు ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్, హోటల్స్ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో పోలింగ్ తేదీ శనివారం కావడంతో , ఎక్కువ మందికి సెలవు ఉండటంతో ఓటింగ్‌కు జనం దూరంగా ఉంటారని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ దశలో సూపర్ మార్కెట్లు తమ పలు స్థాయిల సరుకులపై తగ్గింపు ధరలను ప్రకటించాయి. ఆరవ విడతలో భాగంగా ఢిల్లీలో వచ్చే నెల 25వ తేదీన పోలింగ్ ఖరారయింది. ఓటేసిన వారికి తగ్గింపు ధరలలో వస్తువులు అందుతాయి. ఈ తగ్గింపులు 20 శాతం నుంచి 5 శాతం వరకూ ఉంటాయి. హోటల్స్, అతిధి గృహాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల సాప్‌లకు డిస్కౌంట్లు వర్తిస్తాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పలు సంఘాలు విజ్ఞప్తి చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News