Sunday, January 19, 2025

ఓట్లు మావే.. సీట్లు మావే : ఈటల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ముదిరాజ్ జాతిని ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు.. ఓట్లు మావే.. సీట్లు మావే ఇదే మా నినాదం అని బిజెపి ఎమ్మెల్యే- ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆదివారం పరేడ్ మైదానంలో ముదిరాజుల ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడుతూ ముదిరాజ్‌లను బిసి(డి) నుంచి ఎ లోకి మార్చాలని ఎమ్మెల్యే అయిన మొదటి రోజునుండి కొట్లాడుతున్నానని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008 జడ్చర్ల సభలో ముదిరాజ్ లను డి నుండి ఎ కు మారుస్తా అని ప్రకటించారు. అదే సభలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ప్రకటించారు. బిసి ఎ రిజర్వేషన్ కానీ ఒక్క సంవత్సరం మాత్రమే అమలయ్యింది. మైనారిటీ వాళ్లు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టులో వారు గెలిచారు.

మనకు ఎవరు లేక పట్టించుకోవడం లేదు. బిసి ఏ కోసం 2016 డిసెంబర్‌లో నిజాం కాలేజీలో పెద్ద సభ పెట్టాం. ఏడేళ్లు సంవత్సరాలు గడిచినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. మాది మాకు కావాలని బిఆర్‌ఎస్ పార్టీని ఆడుగుతున్నాం. నీలం మధు, శ్రీనివాస్, పులిమామిడి రాజు లేరా ? ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు.. నాకు అవకాశం ఇస్తే ఈనాటి వరకు ఓడిపోలేదు. రాష్ట్రంలో ముదిరాజ్ జనాభా 11 శాతం ఉంది.. 20 వేల కోట్ల బడ్జెట్ మాకు ఇవ్వాలి.. చేప పిల్లల పేరుతో మాకు ఇచ్చేది 500 కోట్లు. ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్న చేప పిల్లలు కాదు డబ్బులు ఇవ్వండి మేమే కొనుక్కుంటాం. ప్రాజెక్ట్లుల్లో, చెరువులలో సంపూర్ణ అధికారం మత్స్యకారులకు ఇవ్వాలని కోరారు. ఈ సభలో వివిధ జిల్లాలకు చెందిన ముదిరాజ్ నేతలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News