Wednesday, January 22, 2025

ఇండోనేసియాలో అధ్యక్ష ఎన్నికకు ముగిసిన పోలింగ్

- Advertisement -
- Advertisement -

జకర్తా : ఇండోనేసియాలో అధ్యక్ష ఎన్నికకు బుధవారం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల రంగంలో ముగ్గురు నేతల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. 17,000 దీవులతో కూడిన ఇండోనేసియా ప్రపంచం లోనే మూడో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. 270 మిలియన్ మంది ప్రజలు ఉన్నారు. దాదాపు 20,000 నేషనల్, ప్రావిన్షియల్, జిల్లా, పార్లమెంట్ స్థాయిలో ఎన్నికలకు ఒకే రోజు భారీ ఎత్తున పోలింగ్ జరగడం విశేషం. 580 నేషనల్ పార్లమెంట్ స్థానాలకు 18 రాజకీయ పార్టీల నుంచి 10 వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

అనధికారికంగా ఒక రోజులో ఫలితాలు వెలువడనున్నా అధికారికంగా నెలరోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్నవారిలో రక్షణ మంత్రి ప్రబోవో సుబియాంటో, ప్రావిన్షియల్ మాజీ గవర్నర్లు అనియెస్ బస్వెడెన్, గంజార్ ప్రనోవో పోటీలో ఉన్నారు. ప్రజాదరణ కలిగిన అధ్యక్షుడు జోకో విడోడోపై విజయం సాధించాలన్న తపనతో ఈ ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయం పోలింగ్‌కు ముందు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. గతవారం భారీ వర్షం కురియడంతో సెంట్రల్ జావా డెమాక్ రీజెన్సీలో 10 గ్రామాల్లో ఎలెక్షన్ వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News