Friday, December 20, 2024

కాంగ్రెస్ కు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లే

- Advertisement -
- Advertisement -

Voting for Congress is like voting for BJP:Gangula

టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా సంస్థాన్ నారాయణపురంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి గంగుల

కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన బిజెపి అభ్యర్థి మనకెందుకు

మంత్రి గంగుల కమలాకర్ ప్రచారంతో టిఆర్ఎస్కే ఓటేస్తామంటున్న సంస్థాన్ నారాయణ పురం ప్రజలు

హైదరాబాద్ :సంస్తాన్ నారాయణపురం ఎంపీటీసీ టు స్థానంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆదివారం ఉదయం ముస్లిం సోదరుల ఏరియాలో ఎందుకు కారు గుర్తుకు ఓటెయ్యాలో సవివరంగా వివరించారు. ఒక పార్టీ నుండి గెలిచి కాంట్రాక్టుల కోసం, సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిన వ్యక్తి మనకు అవసరమా అని ప్రశ్నించారు, కాంగ్రెస్కు ఓటేసినా… వాళ్లు బిజెపిలోకి వెళ్తారని, పరోక్షంగా బిజెపికి మద్దతు ఇచ్చినట్లేనని స్పష్టంగా తెలియజేశారు. ముస్లిం సంక్షేమం కోసం కెసిఆర్ సర్కార్ చేస్తున్న షాదీ ముబారక్, ఈద్ తోఫా ఇతరత్రా సంక్షేమ కార్యక్రమాల్ని వివరించారు. దీంతో ముస్లింలంతా ముక్తకంఠంతో కారు గుర్తుకే ఓటేసి టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపూర్ జెడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేష్, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, సర్పంచ్ చిక్లమెట్ల శ్రీహరి, టిఆర్ఎస్ నేతలతో పాటు ప్రచారానికి వచ్చిన కరీంనగర్ శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News