Wednesday, January 22, 2025

కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా జరుపుకునేది ఎన్నికల పండగ

- Advertisement -
- Advertisement -

హృతిక్ శౌర్య హీరోగా పరిచయమవుతున్నచిత్రం ’ఓటు’. ఫ్లిక్ నైన్ స్టూడియోస్ నిర్మాణంలో రవి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ‘మనదేశంలో కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ.. ఎన్నికల పండగ’ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

హృతిక్ శౌర్య టీజర్‌లో ప్రామిసింగ్ స్క్రీన్ ప్రజన్స్‌తో ఆకట్టుకున్నారు. అనుభవం వున్న నటుడిలా తన పాత్రలో ఒదిగిపోయారు. హృతిక్ శౌర్య, తన్వి నేగి కెమిస్ట్రీ కూడా బ్యూటీఫుల్ గా వుంది. ఈ ఈవెంట్‌లో ఆర్పీ పట్నాయిక్ మాట్లాడుతూ “వరుణ్ తేజ్ తర్వాత అంత పెద్ద హైట్ వున్న హీరో ఇంకెవరూ రారేమో అనుకున్నప్పుడు హృతిక్ శౌర్య వచ్చారు. తన ఎత్తుకు తగ్గట్టు హైట్స్ కి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను”అని అన్నారు.

హృతిక్ శౌర్య మాట్లాడుతూ “దర్శకుడు రవి నాపై ఎంతో నమ్మకం పెట్టారు. ఆయనకి కృతజ్ఞతలు.చాలా ముఖ్యమైన కథ ఇది. గోపరాజు రమణ ఈ సినిమాలో కీలక పాత్ర చేయడం మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. తన్వి చాలా బ్యూటీఫుల్ గా నటించారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తన్వి, గోపరాజు రమణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News