Sunday, December 22, 2024

మంచం కింద డిటోనేటర్లను పెట్టి పేల్చి… విఆర్ఎ హత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: డిటోనేటర్ల సహాయంతో విఆర్‌ఎను చంపేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ జిల్లా వేముల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొత్తపల్లి గ్రామంలో విఆర్‌ఎ నరసింహ తన భార్య సుబ్బలక్ష్మమ్మతో నివసిస్తున్నాడు. విఆర్‌ఎ తన భార్యతో కలిసి మంచంపై పడుకున్నాడు. దంపతులు గాఢనిద్రలోకి జారుకున్న తరువాత గుర్తు తెలియన వ్యక్తులు మంచ కింద డిటోనేటర్లు పెట్టి పేల్చారు. ఘటనా స్థలంలో నరసింహ మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. ఆమెను గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధంతోనే విఆర్‌ఎను హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News