Monday, December 23, 2024

విఆర్‌ఎల సమస్యలను పరిష్కరిస్తాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మంత్రి కెటిఆర్‌తో విఆర్‌ఎల చర్చలు ముగిశాయి. విఆర్‌ఎలను ఆందోళన విరమించాలని మంత్రి కెటిఆర్ కోరారు. విఆర్‌ఎల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.  ఈ నెల 18 తరువాత విఆర్‌ఎలతో సిఎస్ చర్చలు జరుపుతారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో విఆర్ఎలు తమ ఆందోళనలను విరమించి విధుల్లో చేరాలని మంత్రి కెటిఆర్ కోరారు. మంత్రి కెటిఆర్‌పై తమకు నమ్మకం ఉందని విఆర్‌ఎల సంఘం తెలిపింది. ఇచ్చిన హామీని అమలు చేస్తామని మంత్రి కెటిఆర్ చెప్పారన్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి కెటిఆర్ తమను పిలిచి తమ వాదన వినడం పట్ల విఆర్ఎ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News