Thursday, January 23, 2025

పేస్కేల్ ఇవ్వాలని విఆర్‌ఎల పికెటింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: విఆర్‌ఎలకు పేస్కేల్ ఇవ్వడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విఆర్ఎల సంఘం ఆధ్వర్యంలో గురువారం మోత్కూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద పికెటింగ్ నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యాలయం గేటు వద్ద బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఎలకు పేస్కేల్ ఇస్తామని ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. 55 ఏళ్లు పైబడిన విఆర్‌ఎల వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, అర్హత కలిగిన విఆర్ఎలకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని, హామీలన్నింటిని అమలు చేస్తూ జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎల సంఘం అధ్యక్షుడు ఎస్.యాదయ్య, అధ్యక్షుడు ఎ.సైదులు, ప్రధానకార్యదర్శి ఎం.రవి, ఉపాధ్యక్షురాలు సిహెచ్.మాధవి, సహాయ కార్యదర్శి జె.శ్రీను, కోశాధికారి పరశురాములు, ఎల్లేష్, ఉమ, జమీల, రజినీకాంత్, సురేష్, నర్సింహ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News