Sunday, December 22, 2024

కోర్టును ఆశ్రయించిన విఆర్‌ఏలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విఆర్‌ఏల సర్దుబాటు వివాదంగా మారింది. సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేయడం ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని రెవెన్యూ శాఖలో పని చేస్తున్న 30 మంది ఆఫీస్ సబార్డినేట్లు హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సిసిఎల్‌ఏ, చీఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లతో పాటు పలు జిల్లాల కలెక్టర్లను పార్టీగా చేర్చారు. తెలంగాణ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా విఆర్‌ఏలను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా, సబార్డినేట్లుగా నియమించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News