Monday, November 25, 2024

వృక్షవేదం పుస్తకం చాలా అద్భుతం, ఎంపి సంతోష్ కృషి అభినందనీయం: విజయేంద్రప్రసాద్

- Advertisement -
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడవులు, ప్రకృతి చిత్రాలు పురాణాలలో ప్రకృతి గురించి చెప్పిన శ్లోకాలతో ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకం వృక్షవేదం. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించిన ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్‌ని విజయేంద్రప్రసాద్ అభినందించారు. పుస్తకం చాలా అద్భుంతంగా ఉందని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నప జోగినపల్లి సంతోష్ కుమార్ కృషి అభినందనీయమన్నారు. భారతీయ సినీ ఇండస్త్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు విజయేంద్రప్రసాద్ తెచ్చుకున్నారు. దాదాపుగా 25క పైగా చిత్రాలకు కథలను విజయేంద్రప్రసాద్ అందించారు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ రచయితగా ఇమేజ్ సంపాదించుకున్నారు. బాహుబలి, మెర్సల్, భజరంగీ భాయిజాన్, మణికర్ణిక వంటి చిత్రాలకు కథ అందించారు.

గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్ బాస్3 ఫేమ్ అషూ రెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ యాంకర్ సావిత్రి (శివజ్యోతి) విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అషూ రెడ్డి జూబ్లీహిల్స్ జిహెచ్‌ఎంసీ పార్కులో గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఈ ఛాలెంజ్ ఇచ్చిన శివజ్యోతికి, ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం మన బాధ్యత అని అశురెడ్డి అన్నారు. మనకు మంచి ఆక్సిజన్ లభించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. గ్రీనరీ పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అషురెడ్డి కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సన్నీ, దీపక్, సరోజ్, జస్వంత్ ముగ్గురు నటులకు ఛాలెంజ్ విసిరారు అశురెడ్డి, ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News