Friday, December 20, 2024

వృశ్చిక రాశివారికి ఉద్యోగ, వృత్తివ్యాపారాల్లో పురోగతి!

- Advertisement -
- Advertisement -

ఆదాయం : 08 వ్యయం : 14
రాజ : 04 అవమానం : 05

విశాఖ 4వ పాదము, అనూరాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ 1,2,3,4 పాదముల యందు పుట్టినవారు “తో, నా, నీ, నూ, నే, నో, య, యా, యూ” అను అక్షరములు తమ పేరునకు మొదటగలవారు వృశ్చికరాశికి చెందినవారు

వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఋణాలు చేసి వస్తు, వాహనాలు, గృహాలు తీసుకునే వారికి అనుకూల కాలం. క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు అవసరం. మీకు బ్యాంకు నుండి ఋణాలు తీసుకోవడానికి అనువైన కాలం అని చెప్పవచ్చును. గృహంలో శుభకార్యాలు జరగడానికి సరైన కాలం. ఈ రాశిలో జన్మించిన వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ షష్ఠ, సప్తమ గురు సంచారం, పంచమ చతుర్ధ రాహు సంచారం లాభ స్థానంలో కేతు సంచారం అభివృద్ధిని సూచిస్తుంది. ఆర్థిక పరమైన సమస్యల నుండి బయటకు రావడానికి మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది. మీ సంపాదనలో కొంత భాగం మీ సంతాన అభివృద్ధికే ఖర్చు పెడతారు. కుటుంబంలో ఒకరి సంపాదన మీకు ఆనందాన్ని ఇస్తుంది. భాగస్వామ్యుల వ్యాపారం ప్రధమార్ధంలో కన్నా ద్వితీయార్ధంలో లాభిస్తాయి. సమాజంలో, బంధువుల్లోనూ ప్రతిష్ఠ నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. గృహ నిర్మాణం చేస్తారు. లాటరీలు, జూదాలు, బెట్టింగులు మీకు అనుకూలం అనిపించినప్పటికీ రాబోయే గ్రహ సంచార పరిస్థితుల దృశ్యా వాటికి దూరంగా ఉండడం మంచిది.

సాంప్రదాయాలలో ఉన్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. సినీ, టీవీ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు, భూమి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. కొంత ఆలస్యం అయినా మీరు ఆశించిన తీర్పులు, లాభాలు పొందుతారు. ఈ సంవత్సరం విద్యా సంబంధ విషయా లు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మంచి అభివృద్ధి పథంలో ఉన్నవారికి సన్నిహితులు అవుతారు. మీ కెరీయర్‌కు సంబంధించి మంచి ప్రణాళికలు వారి నుండి చర్చించి, తెలుసుకొని లబ్ధీ పోందుతారు. విద్యార్థినీవిద్యార్థులు ముత్యపు గణపతి లాకెట్ ధరించండి, మేధోదక్షిణా మూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థినీ విద్యార్థులకు మెరి ట్ మార్కులు, స్కాలర్ షిప్పులు వస్తాయి. సివిల్ సర్వీస్‌లకు ఎంపిక అవుతారు. ఐ.ఐ.టిలో సీటు వస్తుంది, మెడిసిన్ సీటు వస్తుంది. సాహిత్య కళాసాంస్కృతిక రంగంలో అభివృద్ది బాగుంటుంది. సంతాన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సంతానం కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం కొంత వరకు అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పవచ్చును.అలాగనే ఈ జన్మనక్షత్రంలో జన్మించిన వారికి ఆరోగ్య పరం గా జాగ్రత్తలు అవసరం. స్త్రీ సంబందిత అనారోగ్య సమస్యలు అధికంగా బాదిస్తాయి.

మధుమేహం(షుగర్), కాలేయ సంబంధిత ఇబ్బందులు, రక్తపోటు, చర్మ సంబంధ సమస్యల విషయాలలో జాగ్రత్త వహించండి. ఆరోగ్య క్రమశిక్షణలు తప్పనిసరిగా పాటించాలి. ఈ రాశిలో జన్మించిన భార్యాభర్తలు మధ్య ఓర్పు, సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరస్పర అవగాహనతో ఒకరినొకరు అర్ధం చేసుకుని, చక్కటి వాతావరణం నెలకొల్పుకోవాలి. లేదంటే శృతిమించి రాగాన పడుతుంది. ఆ ప్రభావం మీ కుటుంబంపై పడుతుంది. మీ పిల్లల భవిష్యత్తుని దృష్ఠిలో ఉంచుకుని ఇటువంటి ఇబ్బందులు పు నరావృతం కాకుండా జాగ్రత్త పడండి. కుటుంబ వ్యవహారాలలో బంధువుల, స్నేహితుల జోక్యం అరికడితే గానీ గృహశాంతి లభించదని గ్రహిస్తా రు. ఎవర్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని నిర్ణయానికి వస్తారు. భార్యాభర్తల ఇరువురి ఆ రోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించండి. ఆ త్మవిశ్వాసంతో చేసే ఏ మంచి పనైనా మంచి ఫ లితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం మీ ద సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News