Wednesday, January 22, 2025

వృషభ రాశి వారికి అక్టోబర్ నుంచి అన్ని కలిసివస్తాయి…

- Advertisement -
- Advertisement -
వృషభం…

–వీరికి ఆదాయం –14, వ్యయం–11, రాజపూజ్యం 5, అవమానం–1.
వీరికి ఈ ఏడాది సమస్థాయిలో ఫలితాలు ఉంటాయి. గురుడు ఏప్రిల్21 వరకు గురుడు అత్యంత శుభుడు. తదుపరి సాధారణ ఫలితాలు ఇస్తాడు. శని మొత్తమంతా శుభఫలితాలు ఇస్తాడు. రాహుకేతువులు అక్టోబర్31వ తేదీ నుండి శుభదాయకమైనవిగా ఉంటాయి. ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాలు కొన్ని పునఃపరిశీలించుకోవలసి ఉంటుంది.
విలాసాలకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ మీకు అనుకూలంగా మారతాయి.
ద్వితీయార్ధంలో స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

ఇంటి నిర్మాణాలు తిరిగి కొనసాగిస్తారు. అలాగే, పెద్ద వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ప్రయత్న లోపం లేకుండా విద్యార్థులు చేసే కృషి ఎంతో ఉపకరిస్తుంది. ఇతరుల పట్ల సామర స్యంగా మెలుగుతూ కార్యాలను చక్కదిద్దుకుంటూ వెళ్లడం ఉత్తమం. ప్రధమార్థంలో ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించి ఖర్చులకు సిద్ధపడాలి. అయితే క్రమేపీ స్వస్థత చేకూరుతుంది. కొందరికి విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు రావచ్చు. కళాకారులకు ఈ ఏడాది అద్భుతమైన అవకాశాలు దక్కుతాయి. వ్యాపారులు తమ సంస్థల విస్తృతి కోసం మరింత కృషి చేస్తారు. పెట్టుబడులకు ఎటువంటి లోటు లేకుండా జరిగిపోతుంది. ఉద్యోగస్తులు తమపై పడిన భారాన్ని తగ్గించుకునేందుకు తాపత్రయపడతారు.

రాజకీయవేత్తలు, పారిశ్రామికరంగం వారి చిరకాల కోరిక నెరవేరవచ్చు. అయితే ప్రధమార్థంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వివాహాది శుభకార్యాలు ద్వితీయార్థంలో కలసివస్తాయి. వ్యవసాయదారులు మునుపటి కంటే లాభపడతారు. వైద్యులు, సాంకేతిక రంగంలోని వారిలో మరింత భరోసా ఏర్పడుతుంది. జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు కలిసివచ్చేవి. మిగతావి సామాన్యం. వీరు అక్టోబర్వరకూ రాహు, కేతువులకు జపాలు వంటి పరిహారాలు చేయాలి. అలాగే, దుర్గామాతకు ఎక్కువగా పూజాదికాలు నిర్వహించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News