Monday, January 20, 2025

‘వృషభ’ ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌ లాంఛ్‌

- Advertisement -
- Advertisement -

వి.కె.మూవీస్‌ పతాకంపై యుజిఓస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సగర్వ సమర్పణలో అశ్విన్‌ కామరాజ్‌ కొప్పల దర్శకత్వంలో ఉమాశంకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వృషభ’. నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి కథను అందించిన ఈ చిత్రంలో జీవన్‌, అలేఖ్య హీరో, హీరోయిన్‌లు. బుధవారం ఫిలింఛాంబర్‌లో ఈ చిత్రం ట్రైలర్‌, పోస్టర్‌లాంచ్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, గౌతమ్‌రాజు తనయుడు హీరో కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సి. కల్యాణ్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.

అనంతరం సి. కల్యాణ్‌ మాట్లాడుతూ…
ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. దర్శక, నిర్మాతలు శివుణ్ణి నమ్ముకున్నారు. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆయన మిమ్మల్ని కరుణించి మీకు మంచి లాభాలు, పేరు తెచ్చిపెట్టాలి. ఈ సినిమాలో శివుడి పాత్ర చాలా ఉన్నట్టుగా ట్రైలర్‌ చూస్తే అనిపిస్తోంది. మంచి ఎమోషన్‌ ఉంది. చక్కటి లొకేషన్స్‌లో రిస్క్‌ అయినా లెక్కచేయకుండా చేసినట్లు ట్రైలర్‌ చూస్తే అర్ధమౌతోంది. నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి భవిష్యత్తులో నిర్మాతగా, కథకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ…
ట్రైలర్‌ చాలా బాగుంది. ఇటీవల అఘోరాల కథతో వచ్చిన ‘అఖండ’ మూవీ ఎంత హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈసినిమా కూడా శివుడు, అఘోరాల బ్యాక్‌డ్రాప్‌లో మంచి కంటెంట్‌తో వస్తోంది. తప్పకుండా సక్సెస్‌ అవుతుందని నమ్ముతున్నాను. హీరో, హీరోయిన్‌ల నటన కూడా చాలా నేచురల్‌గా ఉంది. ఇవాళ పాన్‌ ఇండియా, పాన్‌ వరల్డ్‌ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాంటి సమయంలో కూడా ‘వృషభ’ వంటి చిన్న సినిమాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇలాంటి చిన్న సినిమాలు కూడా పాన్‌ ఇండియా రేంజ్‌కు వెళతాయి. యూనిట్‌ అందరికీ ఆల్‌ది బెస్ట్‌ అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…
ట్రైలర్‌, టైటిల్‌ ప్రేక్షకులని థియేటర్‌కు రప్పిస్తాయి. ఆ రెండూ చిత్రానికి బాగా ప్లస్‌ అయ్యాయి. మంచి రా టైపు కంటెంట్‌తో నేచురల్‌గా ఉంది. ఈ ట్రైలర్‌ చూసిన ప్రేక్షకుడు తప్పకుండా మార్నింగ్‌షోకే థియేటర్‌కు వచ్చేస్తాడు. యూనిట్‌ అందరికీ మంచి సక్సెస్‌ ఇస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

ప్రముఖ నిర్మాత, సంతోషం అధినేత సురేష్‌ కొండేటి మాట్లాడుతూ…
ఈ టైటిల్‌ నాకు చెప్పగానే అద్భుతంగా ఉంది అన్నాను. కొన్ని సినిమాల ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌లు చూడగానే ఈ సినిమా సక్సెస్‌ అవుతుంది అని చెప్పేయవచ్చు. ఆ కోవకు చెందినదే ఈ సినిమా. తప్పకుండా ఇది మంచి పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

హీరో కృష్ణ (గౌతమ్‌రాజు తనయుడు) మాట్లాడుతూ…
మా దర్శకుడు కామరాజ్‌ గారు తనలోని ఆవేశం అంతా ఈ ట్రైలర్‌లో చూపించారు. అలాగే నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి గారు మంచి కథను అందించారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతూ అందరికీ ఆల్‌ది బెస్ట్‌ అన్నారు.

చిత్ర హీరో జీవన్‌ మాట్లాడుతూ…
అందరం చాలా కష్టపడి చేశాం. ఇంకా క్లైమాక్స్‌ ఫైట్‌ చిత్రీకరించాల్సి ఉంది. ఈ చిన్న సినిమాను పెద్ద సినిమాగా భావించి ప్రమోట్‌ చేయాలని మీడియా మిత్రులను కోరుతున్నా అన్నారు.

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ…
మంచి కంటెంట్‌తో, డిఫరెంట్‌ జోనర్‌ను టచ్‌ చేశాం. డివోషనల్‌గా వెళుతూనే పశువులకు, మనుషులకు మధ్య ఎంత బాండిరగ్‌ ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం చేశాం. ఈ సినిమా 1966`1990 మధ్య జరిగే కథ. యూనిట్‌ అందరూ బాగా సపోర్ట్‌ చేశారు. ఈ ట్రైలర్‌ని అందరూ మెచ్చుకుంటున్నారు. సినిమాలో ఇంకా అద్భుతాలు ఉన్నాయి అన్నారు.

నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి మాట్లాడుతూ…
ఓ మారుమూల పల్లెలోని ఒక చిన్న గుడిలో ఈ కథ నా మదిలో పుట్టింది. మూడు సంవత్సరాల పాటు దాన్ని డెవలప్‌ చేసుకుంటూ వచ్చాను. దాదాపు 70 శాతం షూటింగ్‌ అయిపోయింది. ఇంకా ఫైనల్‌ షెడ్యూల్‌ బ్యాలెన్స్‌ ఉంది. ఆగష్ట్‌లో అది కూడా పూర్తి చేస్తాం. మా హీరో జీవన్‌రెడ్డి అయితే చాలా సాహసాలే చేశారు ఈ సినిమా కోసం. మురళీమోహన్‌ గారు ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. అలేఖ్య కూడా చాలా బాగా చేసింది. నటీనటులు, టెక్నీషియన్స్‌ తమ స్వంత సినిమాగా ఫీలయ్యి చేశారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News