Monday, January 20, 2025

మైసూర్ లో రోషన్ పాన్ ఇండియా మూవీ షూటింగ్..

- Advertisement -
- Advertisement -

‘పెళ్లిసందడి’ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రి ఇచ్చిన హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోషన్ రెండో సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతోంది. ఎపిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా భారీ బడ్జెత్ తో ఈ సినిమాను ఎవిఎస్ మూవీస్, ఫస్ట్ స్టెప్ మూవీస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జూలై 22న(శనివారం) మైసూర్ లో ప్రారంభమైంది.

ఈ మూవీకి వృషభ అనే టైటిల్ ఖరారు చేశారు. నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళం స్టార్ మోహన్ లాల్, షానాయకపూర్, జహ్రాఖాన్, రాగిణి ద్వివేది, శ్రీకాంత్ మేకా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2024లో మలయాళం, తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 4500 స్క్రీన్‌లలో ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News