Wednesday, December 4, 2024

వృషభ రాశివారు ఖర్చులు తగ్గించుకోవాల్సిందే!

- Advertisement -
- Advertisement -

వృషభరాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలు లాభిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. మొత్తం మీద శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ సంతానం వలన పురోగాభివృద్ధి, మానసిక సంతోషం లభిస్తుంది. విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షలు, విదేశాలలో అభ్యసించడానికి, విదేశీయా నం వంటి వాటికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదే విధంగా గ్రీన్‌కార్డ్ కోసం, పరిశోధనా రం గంలో ఉన్న వారికి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గురువు ద్వాదశ రాశి సంచారం, తదుపరి జన్మరాశి సంచారం, శని దశమ స్థాన చలనం, కేతువు పంచమ స్థాన చలనం, రాహువు లాభస్థాన మందు, గురు, శుక్ర మోఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి.

మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు, వ్యాపారాలకు, ఉన్నతాధికారులకు సంవత్స ప్రధమార్ధంలో కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉం ది. మీరు గతంలో చేసిన, చేస్తున్నా పెట్టుబడులు జీవితంలో పురోగాభివృద్ధిని కలిగిస్తాయి. కోర్టు పరంగా, కుటుంబ పరంగా వచ్చే వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం బాగుంటుంది. పాతస్నేహాలు, కొత్తస్నేహాలు కలగలుపుగా పరపతి కలిగిన వారి పరిచయాలే ప్రాతిపదికగా, ప్రామాణికంగా కొన్ని కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసి ప్రయోజనం పొందుతారు. విద్యార్ధిని, విద్యార్ధులకు చదువు మీద శ్రద్ధ చాలా అవసరం. చదుపుపై ఏకాగ్రత కోసం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిత్యం శ్రీమేధాదక్షిణామూర్తి శ్లోకం పఠించండి.మీ మెడలో శ్రీమేధాదక్షిణామూర్తి రూపు ధరించండి. కొంత వరకు చదువుమీద ధ్యాస ఏర్పడుతుంది. విదేశాలలో అభ్యసించాలనుకునే వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది.

వాటిని అధిగమించి మీరు కోరుకున్న విద్యను పొందడానికి ఓపిక, సహనం అవసరం. గీన్ కార్డు కోసం ప్రయత్నించేవారికి ఈ సంవత్సరం గ్రీన్‌కార్డు లభిస్తుంది, పి.ఆర్ లభిస్తుంది, హెచ్.1బి వీసా లభిస్తుంది. పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలు, బ్యాంకు పరీక్షలు, టీచరు పరీక్షలు మొదలైన వాటిల్లో సానుకూల ఫలితాలు సాధిస్తారు. ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఐ.టి వంటి ప్రతిష్టాత్మకమైన వాటికి ఎంపిక అవుతారు.
కుటుంబంలో స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి. భార్యభర్తల మధ్య వచ్చే గొడవలు పెద్దవి కాకుండా చూసుకోవడం చాలా అవసరం. చిన్న చిన్న మాటలే పెద్ద దూమారానికి దారి తీస్తుంది. మాటపట్టింపు, విభేదాలు కుటుంబలోని సఖ్యతను పాడుచేస్తుంది. ఆ కారణంగా మానసిక ప్రశాంతత లేకపోవడం, చికాకు, చిక్కులు కలిగిస్తాయి. సంసార జీవితంలో ఎటువంటి అరవరికలు లేకుండా ఉండును.

మీ జీవి త భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత వర కు జాగ్రత్తలు అవసరం. తీర్ధ యాత్రల కొరకు ధనాన్ని వెచ్చిస్తారు. కుటుంబంలో శుభకార్యా లు చేస్తారు. ఏ పని తలపెట్టినా చాలా శ్రమపడి విజయం సాధిస్తారు. వివాహ పరంగా కొంత ఆలస్యం అయినా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. దగ్గరగా వచ్చి చేజారిపోతున్న సంబంధాలపట్ల ఆందోళనకు గురి అవుతారు. మీరు చేసిన దానధర్మాల పుణ్యం వల్ల ఎట్టకేలకు ఒక మంచి సంబంధం కుదురుతుంది. మానసిక సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధ విషయాలలో కూడా మీ కృషి ఫలిస్తుంది. ప్రేమ వివాహాలను మాత్రం కఠినంగా వ్యతిరేకిస్తారు.

అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ మనస్సాక్షికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని కుటుంబంలోనూ, బంధువులలోనూ కొంత అలజడి సృ ష్టిస్తారు. ఆదర్శవంతమైన జీవితంలో సక్రమంగా నడుస్తున్న మీ వ్యవహారశైలికి బంధువర్గం నుండి విమర్శలు పొందుతారు. పిల్లల ప్రవర్తన మిమ్మల్ని కొంత వరకు బాధ పెట్టవచ్చు. సంతాన పురోగతికై అధిక మొత్తంలో ధనం ఖర్చు చేయాల్సి రావచ్చు. సంతానం కోసం ప్రయత్నించే వారికి ప్రస్తుతం అనుకూల కాలం కాదు. స్పెక్యులేషన్ అనుకూలం. ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండుట మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి రాజకీయ ప రంగా అనుకూలంగా ఉంది.

రాజకీయ నాయకులకి కలిసొచ్చే కాలం అని చెప్పవచ్చును. క్రింది స్థాయి నుండి వచ్చే వారికి రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ ఎదుగుదల సంతృప్తికరంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీ జీవితాశయం నెరవేరుతుంది. కార్మిక వర్గానికి అనుకూలంగా ఉంటుంది. మీ శ్రమకు తగినంత కాకున్నా గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు గోచరిస్తున్నాయి. గతంలో కొనుగోళ్ళు చేసిన స్థిరాస్తుల విలువ పెరిగినా అమ్మడానికి వీలులేని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్తలు అవసరం. మోకాళ్ళు, వెన్ను నొప్పులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం పోటీపరీక్షలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఉన్నత పదవులు వంటివి వరిస్తాయి. మీరు ఎంతోకాలంగా బదిలీ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకూలమైన కాలం అని అనుకోవచ్చు. లాయర్లకి, డాక్టర్లకి, ఫార్మసీ రంగాల వారికిఅనుకూలమైన కాలమని చెప్పవచ్చును.

అదే విధంగా మద్యం, మాంసం, నూనె, పెట్రోలియం రంగాల వారికి కూడా కలిసొచ్చే కాలం. భాగస్వాముల వ్యాపారాలకు అంత అనుకూలమైన కాలం కాదు. చేజారిపోయాయి అనుకున్న మీ స్థిరాస్తులు తిరిగి మీకు అందే అవకాశాలు ఉన్నాయి. సినీ పరిశ్రమ, పత్రికారంగం వారికి కొంత వరకు అ నుకూల ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. టీవీ రంగంలోని వారికి ప్రజాదరణ గతంలో కన్నా ఇప్పుడు పెరిగినా కూడా తగిన ప్రోత్సాహం, అవకాశాలు అందని ద్రాక్షలాగే ఉంటుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమా లు, విద్యాసంస్థలు, అనాధ ఆశ్రమాలు, దివ్యాంగులకు సంబంధించిన ఆశ్రమాలు మొదలైన వాటికి మంచిఖ్యాతిలభిస్తుంది. ఆర్థిక సహాయం అందుతుంది. ఈ రాశికి అనుకూలమైన శని, రాహు గ్రహ ప్రభావం వలన వృత్తివ్యాపార సం బంధ విషయాలలో మీ వ్యూహాలు ఫలిస్తాయి.

మీ సొంత వ్యాపారాలలో లాభాలు మీకు కలిసి వస్తాయి. మీ కుటుంబంలోని వారు బాధ్యతలు తీసుకోవడంతో కొంత వరకు అవరోధాలు ఏర్పడవచ్చు. వృత్తిఉద్యోగాల పరంగా కాని ఇతరత్రా విషయాల వలన కాని న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి రావచ్చు. ఆర్థిక సమస్యలు ఓ కొలి క్కి వస్తే వేరేసమస్యలు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరాంతం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్స రం ఈ రాశివారు అంగారక పాశుపత ెమం చే యించుకుని, ఎనిమిది(8) సోమవారాలు శివుడికి అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితా లు అందుకుంటారు. ముఖ్యంగా కాలభైరవ అ ష్టకం, హనుమాన్ చాలీసా నిత్యం పఠిస్తే మంచిఫలితాలను సొంతం చేసుకున్న వారవుతారు. నూతన గృహాలు, భూములు క్రయవిక్రయాలు చేసే వారికి ఏప్రిల్ లోపల తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News