Monday, December 23, 2024

ద్రవిడ్‌కు విశ్రాంతి.. తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

ముంబై: న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఈ సిరీస్‌లో భారత మాజీ క్రికెటర్ వివిఎస్.లక్ష్మణ్ టీమిండియా తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. న్యూజిలాండ్‌లో పర్యటించే టీమిండియా మూడు టి20లు, మరో 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్ 18 నుంచి ఈ సిరీస్ జరుగనుంది. సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్ తదితరులకు విశ్రాంతి కల్పించారు. టి20 సిరీస్‌లో హార్ధిక్ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. తాజాగా ప్రధాన కోచ్‌కు కూడా విశ్రాంతి ఇవ్వడంతో లక్ష్మణ్ ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News