Sunday, February 2, 2025

టీమిండియా హెడ్ కోచ్‌గా వివిఎస్ లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

ముంబై: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా ప్రదర్శనపై ఇంటాబయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త ఆటతీరుతో సిరీస్ కోల్పోయిన రోహిత్ సేనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు మాజీలు. అయితే ఈ టెస్టు సిరీస్ అనంతరం టీమిండియా బిజీ షెడ్యూల్ ఉండనుంది. ప్రస్తుత కోచ్ గౌతంగంభీర్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండనున్నాడు. దీంతో భారత్‌కు తాత్కలిక కోచ్ అవసరం పడింది.

దీంతో ఎన్‌సిఎ డెరెక్టర్‌గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్‌ను హెడ్ కోచ్‌గా నియమించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది భారత క్రికట్ బోర్డు(బిసిసిఐ). నవంబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ రెండు పర్యటనలకు లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కాగా, నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న అయిదు టెస్టుల సిరీస్ కోసం రోహిత్ సేన నవంబర్ 10న బయలుదేరే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికాలో నవంబర్ 8 నుంచి 13వ తేదీ వరకు సౌతాఫ్రికాతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News