Friday, December 27, 2024

వైశ్యులలో రాజకీయ చైతన్యం కోసం కృషి చేస్తా: మురంశెట్టి రాములు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే రోజులలో వైశ్యులలో రాజకీయ చైతన్యం సనాతన ధర్మ పరిరక్షణ అమ్మ ఆవు అన్నం దేహరక్షణ దేశ రక్షణ లాంటి సప్త సూత్ర ప్రణాళికతో వైశ్యులను చైతన్యం చేసేందుకు కృషి చేస్తామని సౌత్ ఇండియా వైశ్య యూత్ పరిషత్ ఫౌండర్ ప్రెసిడెంట్, టిటిడి బోర్డు సభ్యులు మురంశెట్టి రాములు తెలిపారు. ఆదివారం ఐదు రాష్ట్రాల రాష్ట్ర కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు అందులో భాగంగా తిరుమలగిరిలో కేంద్ర కార్యాలయం, రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Also Read: జర్మనీ టెక్నాలజీ…. ఆ బోగీలలో భద్రత ఎంత?

ఈ సందర్భంగా వేద పండితులచే పూజా కార్యక్రమాలను నిర్వహించి వైశ్యులకు వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బచ్చు శ్రీనివాస్ సౌత్ ఇండియా వైశ్య యూత్ పరిషత్ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కూర నాగరాజు ,కార్యదర్శి మేదిశెట్టి వెంకట గుప్తా ,కోశాధికారి నేలమడుగుల మురళీకృష్ణ ,ఆర్గనైజింగ్ కార్యదర్శి నంగునూరు సత్యనారాయణ ,ఉపాధ్యక్షులు బి శ్రీధర్, గౌరిశెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News