Monday, December 23, 2024

వ్యూహం మూవీకి మరో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను హైకోర్టు రద్దు చేసింది. మరోసారి మూవీని రివ్యూ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డును ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కించపరిచేలా ఈ మూవీని రూపొందించారని ఆరోపిస్తూ, సినిమా ప్రదర్శనకు ఇచ్చిన సిబిఎఫ్ సీ ధ్రువీకరణను రద్దు చేయాలని కోరుతూ నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్  వేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రభావం ఉంటుందని హైకోర్టు భావించిన పక్షంలో, తెలంగాణాలోనైనా సినిమా రిలీజ్ కు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది గతంలో కోరిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News