Monday, December 23, 2024

వివాదాలు చేస్తున్నది టిడిపి వాళ్లు.. నేను కాదు: ఆర్‌జివి

- Advertisement -
- Advertisement -

అమరావతి: వ్యూహం సినిమాతో వివాదం సృష్టించడంలేదని రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. వివాదాలు చేస్తుంది టిడిపోళ్లు అని మండిపడ్డారు. కొలికిపూడి శ్రీనివాస్‌పై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై డిజిపి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ప్రొసీజర్ ఫాలో అయ్యి చర్యలు తీసుకుంటామని, వ్యూహం సినిమాలో ఏదో చూపిస్తున్నారని కంగారుపడుతున్నారని, తనకు తెలిసిన విషయాలను సినిమాగా తీశానని, టిడిపోళ్లు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని చురకలంటించారు. మీరు తప్పు చేయనప్పుడు భయం ఎందుకు అని నిలదీశారు. వాళ్లకు వాళ్లే ఏదో ఊహించుకుంటున్నారని ఆర్‌జివి ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News