Wednesday, January 22, 2025

తొలగిన సెన్సార్‌ అడ్డంకులు.. ఆర్జీవీ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్..

- Advertisement -
- Advertisement -

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా వ్యూహం విడుదలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణ హైకోర్టు సూచనలతో వ్యూహం సినిమాకు రెండోసారి సెన్సార్ చేయడంతో విడుదలకు అనుమతి లభించింది. దీంతో ఈ నెల 16న వ్యూహం సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన కోర్టు సినిమా విడుదలను అడ్డుకుంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు మళ్లీ సెన్సార్ చేయాలని సూచించింది. కోర్టుల ఆదేశాలతో రెండోసారి సెన్సార్ పూర్తి కావడంతో వ్యూహం సినిమా విడుదలకు కోర్టు అనుమతించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News